ETV Bharat / crime

అర్ధరాత్రి చైన్​స్నాచింగ్​.. వృద్ధురాలిని లాక్కెళ్లిన దొంగ - కృష్ణా జిల్లాలో చైన్​స్నాచింగ్​

Chain snatching: ఏపీలోని పెదపారుపూడి మండలంలో దారుణం చోటుచేసుకుంది, ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేసే యత్నంలో దుండగుడు ఆమెను దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లాడు. రెండు పేటలు ఉన్న నాంతాడును ఆమె గట్టిగా పట్టుకోవడంతో....ఇంట్లో నుంచి ఆమె బయట గేటు వరకు లాక్కురావడంతో ఆమె చేతి వేళ్లు కోసుకుపోయాయి. కాళ్లకు, పొట్టపైన గాయాలయ్యాయి.

Chain snatching
అర్ధరాత్రి చైన్​స్నాచింగ్​.. వృద్ధురాలిని లాక్కెళ్లిన దొంగ
author img

By

Published : May 10, 2022, 12:32 PM IST

ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు నానుతాడు చోరీ చేసే యత్నంలో వృద్ధురాలిని దుండగుడు 50 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో తన ఇంట్లో నిద్రిస్తున్న బొమ్మనబోయిన సుశీల అనే మహిళ మెడలోని రెండు వరుసలున్న ఆరు కాసుల బంగారు నానుతాడును లాక్కెలెందుకు దుండగుడు యత్నించాడు. మహిళ గొలుసును గట్టిగా పట్టుకున్నా... వదలని దుండగుడు ఇంటి బయట ఉన్న గేటు వరకు ఆమెను లాక్కెళ్లాడు. ఈ పెనుగులాటలో వృద్ధురాలికి పలు చోట్ల గాయాలు కాగా, నాలుగు వేళ్లు తీవ్రంగా కొసుకుపోయాయి.ఇంట్లో పడుకుని ఉన్న తనపై ముసుగు వేసుకున్న ఆగంతకుడు దాడి చేశాడని బాధితురాలు బొమ్మనబోయిన సుశీల వాపోయారు. పెదపారుపూడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగిన ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు.

" రాత్రి రెండున్నర గంటల సమయంలో ఎవరో వచ్చిన మెడ మీద చెయ్యి వేశారు. నేను మెడలోని తాడును పట్టుకున్నా. అతడు కూడా అదే పట్టుకుని లాగాడు. నేను వదలకపోయే సరికి నన్ను బయట గేటు వరకు అలాగే లాక్కెళ్లాడు. నా గాయాలయ్యాయి. చేతి వెళ్లు కోసుకుపోయాయి. నా వల్ల కాలేదు. చైను వదిలేయడంతో మెడ మీది నుంచి తీసుకుని వెళ్లిపోయాడు."- బొమ్మనబోయిన సుశీల, బాధితురాలు

అర్ధరాత్రి చైన్​స్నాచింగ్​.. వృద్ధురాలిని లాక్కెళ్లిన దొంగ

ఇదీ చదవండి : తాలిబన్ల కిరాతకానికి బలైన భారతీయ ఫొటో జర్నలిస్టుకు 'పులిట్జర్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.