ETV Bharat / crime

రాజేంద్రనగర్​లో మరోసారి చైన్​ స్నాచింగ్​.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు - వైరల్​ వీడియోలు

Chain snatchers CC footage: హైదరాబాద్​లోని రాజేంద్ర నగర్​లో మరోసారి గొలుసు దొంగలు తన చేతి వాటం ప్రదర్శించారు. ప్రేమావతిపేటలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బంగారం గొలుసు లాకెళ్లారు. దీంతో బాధిత మహిళ కింది పడిపోగా ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Chain snatchers in Rajendranagar
Chain snatchers in Rajendranagar
author img

By

Published : Nov 2, 2022, 7:43 PM IST

Chain snatchers in Rajendranagar: హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​లో మరోసారి చైన్​ స్నాచర్స్​ రెచ్చిపోయారు. రాజేంద్రనగర్​లోని ప్రేమావతిపేటలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న చంద్రకళ అనే మహిళ మెడలోంచి దుండగలు గొలుసు లాక్కెళ్లారు. బస్తీ దవాఖానాలో హెల్పర్ పనిచేస్తోన్న చంద్రకళ ఎప్పటిలానే నడుచుకుంటూ వెళ్తుంది.

ఇంతలో ద్విచక్రవాహనంపై నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి సుమారు మూడు తులాల బంగారు గొలుసు తెంచేశారు. దీంతో బాధిత మహిళ కింద పడిపోగా.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్​ పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రాజేంద్రనగర్​లో మరో సారి చైన్​ స్నాచింగ్​.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.