ఏటీఎంలో జమ చేయాల్సిన నగదు తీసుకుని పరారైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రెండ్రోజుల నుంచి ఉద్యోగానికి గైర్హాజరవ్వడం వల్ల అనుమానమొచ్చిన కంపెనీ యాజమాన్యం ఆరా తీయగా.. ఏటీఎంలో జన చేయాల్సిన రూ. కోటి ముప్పై లక్షలు తీసుకుని పరారైనట్లు తేలింది. వెంటనే వారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కృష్ణ, మహబూబాబాద్‌కు చెందిన రాజేశ్ వ్యక్తులుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి రూ.16 లక్షలు నగదు సీజ్ చేశారు. గతంలో ఈ తరహా మోసంలోనే రాజేశ్ అనే వ్యక్తి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
- ఇదీ చూడండి : సైబర్ నేరగాళ్లు టోకరా.. రూ. 7లక్షలు మాయం