YS Viveka Murder Case Update : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. పులివెందుల అర్ అండ్ బీ అతిథి గృహంలో.. ముగ్గురు అనుమానితులు విచారణకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా సాక్షి విలేకరి బాలకృష్ణారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో.. బాలకృష్ణారెడ్డి కడప సాక్షి విలేకరిగా పని చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ.. శివశంకర్‌రెడ్డి బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు బాలకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. రెండు రోజుల క్రితం.. జమ్మలమడుగుకు చెందిన సాక్షి పత్రిక, టీవీ విలేకరుల నుంచి సమాచారం రాబట్టారు.
సీబీఐ విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి
పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. యురేనియం కర్మాగారంలో పని చేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి గురించి.. రెండు రోజుల క్రితమే కర్మాగారం వెళ్లిన సీబీఐ అధికారులు.. ఉదయ్ గురించి ఆరా తీశారు. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి ప్రకాశ్‌రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించింది. మరోవైపు ఇదే కేసులో డా. మధుసూదన్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈయన పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేస్తున్నారు.
దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్
YS Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్యకేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఇటీవల ఛార్జిషీట్ దాఖలు చేసింది. శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా చేరుస్తూ పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ వేశారు. మొదటి ఛార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లు చేర్చగా.. రెండో ఛార్జిషీట్‌లో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు చేర్చారు. మరోవైపు ఈ కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు గత నెలలో కొట్టేసింది. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కేసు తీవ్రత , ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు సైతం బెయిల్ నిరాకరించిందని గుర్తుచేసింది. ఈ క్రమంలో సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటులోనూ శివశంకర్ రెడ్డి పేర్చు చేర్చటం ఆసక్తిని రేపుతోంది.
ఇవీ చదవండి :