ETV Bharat / crime

Fire accident: రిపేర్ కోసం వచ్చిన కార్లలో మంటలు... చూస్తుండగానే దగ్ధం - అగ్నిప్రమాదంలో కార్లు దగ్ధం

Fire accident: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్​పల్లి చెక్​పోస్ట్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం వచ్చిన రెండు కార్లలో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Fire accident
అగ్నిప్రమాదం
author img

By

Published : Mar 10, 2022, 4:29 PM IST

Fire accident: సికింద్రాబాద్ పరిధిలో బోయిన్​పల్లి చెక్​పోస్ట్ సమీపంలోని మెకానిక్ షెడ్​లో నిలిపి ఉన్న కార్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మరమ్మతుల కోసం వచ్చిన రెండు కార్లు మంటల్లో కాలిపోయి దగ్ధమయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అసలేం జరిగిందంటే..

షెడ్​లో ఉన్న చెత్త తగులబెట్టే క్రమంలో మంటలు కార్లకు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగి అవి దగ్ధమయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గత కొన్నాళ్లుగా కార్లు షెడ్​లోనే ఉన్నాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని వారు పేర్కొన్నారు.

బోయిన్​పల్లి చెక్​పోస్ట్ సమీపంలో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి:టైర్ల దుకాణంలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడ్డ మంటలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.