వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు కల్వర్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కెనాల్లో పడిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని గ్యాస్ గోదాం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో నలుగరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
జిల్లాలోని మంథని మండలం కన్నాల గ్రామంలో దశదిన కర్మలో పాల్గొన్న నలుగురు వ్యక్తులు మంథనికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో మంథని గ్యాస్ గోదాం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొట్టింది. 50 ఫీట్ల దూరం పల్టీ కొట్టి పక్కనే ఉన్న కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన వైద్య చికిత్సకోసం వారిని కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించామని ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి: మిల్క్‌షేక్ దుకాణంలో అగ్నిప్రమాదం... 6 లక్షల మేర నష్టం!