ETV Bharat / crime

Dundigal Car Accident : ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం - మేడ్చల్​ నేర వార్తలు

car hits lorry at dundigal
car hits lorry at dundigal
author img

By

Published : Dec 12, 2021, 8:11 AM IST

Updated : Dec 12, 2021, 9:20 AM IST

08:08 December 12

Dundigal Car Accident : ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం

Dundigal Car Accident : మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేన్‌ పరిధిలోని బౌరంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Car Hits Lorry at Dundigal : మృతులు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, విజయవాడకు చెందిన చరణ్(26), సంజు(25), గణేష్(25)గా గుర్తించారు. మరో యువకుడు అశోక్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన అశోక్‌ అనే వ్యక్తిని సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Dundigal Accident Today : ఈ యువకులు నిజాంపేట్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో చరణ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. నలుగురు యువకులు మద్యం తాగి ఉన్నట్లు తెలిపారు. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్​ బెలూన్​ ఓపెన్​ అయినప్పటికీ వేగం ఎక్కువగా ఉండడం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి : Car Accident Case: కారు బీభత్సం కేసులో వెలుగులోకి మూడో వ్యక్తి.. ఇన్ని రోజులు ఎందుకు దాచారంటే?

Last Updated : Dec 12, 2021, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.