ఎండాకాలం వస్తుందంటే వాహనాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎండకు రోడ్లే కాదు.. వాహనాలు కూడా భగ్గుమంటున్నాయి. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
డిచ్పల్లి నుంచి వస్తున్న కారులో మంటలు చెలరేగడం వల్ల డ్రైవర్ కారును పక్కకు ఆపాడు. కారులో ఉన్న వారు దిగిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
- ఇదీ చదవండి : ఎండా కాలం.. మండే వాహనం.. బీ అలర్ట్!