ETV Bharat / crime

కారు బోల్తా... బాలుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు - telangana latest updates

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

car accident  near Suraram Zulurpadu zone of  bhadradri Kottagudem district
కారు బోల్తా... బాలుడు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
author img

By

Published : Feb 23, 2021, 3:26 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సూరారం సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో శివ అనే బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.

సూరారం గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లిన బాణోత్ వినోద్.. కారులో తన ఇద్దరు పిల్లలతో పాటు మేనల్లుడు శివను తీసుకొని ఏన్కూరు మండలం నాచారం బయలుదేరాడు. కొద్ది నిమిషాల్లోనే వారిని ప్రమాదం వెంటాడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గాయాలైన గూగులోత్ కుమారి, బాణోత్ రిషిత్​లను స్థానికులు జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:సీఎం సెక్రటరీ తెలుసంటూ మోసాలు.. అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.