ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు. గత ఐదేళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని అభ్యర్థులు వాపోయారు.
ప్రగతిభవన్ సమీపంలోని పోలీసులు పీఈటీ అభ్యర్థులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆరెస్టు చేసిన అభ్యర్థులను పోలీసులు గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఇదీ చదవండి: భాగ్యనగరంలో మళ్లీ పాత జోష్... రాత్రివేళ షికార్లు