btech student commit suicide: తనువు చాలిస్తున్నట్లు లేఖ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన విద్యార్థిని సాత్విక (19) కండ్లకోయ సీఎంఆర్ టెక్నికల్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. బాత్రూంలోకి వెళ్లి చాలా సమయం వరకు తిరిగి రాలేదు.
స్నేహితులు గమనించి వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి తలుపు పగులగొట్టి చూడగా.. గ్రిల్స్‌కు చున్నీతో ఉరివేసుకొని చనిపోయింది. శనివారం రాత్రి కళాశాల వార్షికోత్సవంలో స్నేహితులతో కలిసి వెళ్లొచ్చిందని, అందరితో కలిసిమెలిసి ఉండేదని వార్డెన్ చెప్పారు. ‘క్విట్టింగ్ మై లైఫ్, సారీ మమ్మీ డాడి’ అంటూ లేఖ రాసింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత సున్నిత మనస్తత్వం కాదని, తాము రాకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారంటూ కళాశాలకు చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సీఎంఆర్ కళాశాల వద్ద ఈరోజు విద్యార్థి సంఘాలు, నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన సాత్విక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా నిర్వహించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని మృతదేహాన్ని హాస్టల్ నుంచి ఎందుకు తరలించారని నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్న నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: ఆలయంలోకి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరు చిన్నారులు మృతి, 10మందికి గాయాలు