ETV Bharat / crime

ఆస్తి కోసం బావ మాస్టర్ ప్లాన్.. బావమరిదిని చంపేసి.. - boy murder for property in Ananthapuram

Boy Murder For Property: బావమరిది బావ బతుకు కోరతారంటారు. అలాంటి బావమరిదిని ఆస్తి కోసం దారుణంగా హత్య చేశాడు ఓ బావ. 13 ఎకరాల పొలం కోసం 15 ఏళ్ల బాలుడిని చంపేసి.. మూడో కంటికి తెలియకుండా పూడ్చి పెట్టాడు. దాదాపు 70 రోజుల తర్వాత గానీ.. మిస్టరీ వీడలేదు.

ఆస్తి కోసం బావ మాస్టర్ ప్లాన్.. బావమరిదిని చంపేసి..

author img

By

Published : Aug 4, 2022, 12:04 PM IST

ఆస్తి కోసం బావ మాస్టర్ ప్లాన్.. బావమరిదిని చంపేసి..

Boy Murder For Property: ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరు గ్రామానికి చెందిన అఖిల్(15) మే 21న తిమ్మప్పస్వామి జాతరకు వెళ్లి అదృశ్యమయ్యాడు. రోజులు గడిచినా తిరిగిరాలేదు. మే 22న అఖిల్‌ తల్లి శారదమ్మ.. తన కుమారుడు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిన్న కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. దాదాపు 70 రోజుల తర్వాత అఖిల్‌ ఇక లేడని తేల్చారు.

శారదమ్మకు అఖిల్‌తో పాటు.. వర్షిత, త్రిష అనే ముగ్గురు సంతానం. వర్షితను 8 నెలల క్రితం గుద్దేళ్ల గ్రామానికి చెందిన అనిల్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నిరోజుల తర్వాత అనిల్‌ కన్ను.. అత్త ఆస్తిపై పడింది. ఆమెకు ఉన్న 13 ఎకరాలు తన సొంతమవ్వాలంటే బావమరిది అఖిల్‌ను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. సెల్‌ఫోన్‌ ఇప్పిస్తానంటూ అఖిల్‌ను బైక్‌ ఎక్కించుకున్నాడు. తన పొలం పక్కనే ఉన్న వంకలోకి తీసుకెళ్లాడు. అఖిల్ కాళ్లు, చేతులు వైర్‌తో కట్టేసి మెడపై కొడవలితో వేటు వేశాడు. అనంతరం అక్కడే గుంతలో పూడ్చేశాడు.

ఆ తర్వాత ఏమీ ఎరుగనట్టు అనిల్‌ ఇంటికి వెళ్లిపోయాడు. కొన్నిరోజులు అలాగే నటించాడు. ఊళ్లోనే ఉండి పోలీసుల విచారణను పసిగట్టాడు. విచారణ అటు తిరిగి ఇటు తిరిగి తనవైపు వస్తోందని గ్రహించి నెల క్రితం అనిల్‌ పరారయ్యాడు. అఖిల్‌ను ఆఖరిసారి అనిల్‌ బైకుపై చూసినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పడం.. అదే సమయంలో అనిల్‌ పరారవడంతో పోలీసుల అనుమానం బలపడింది.

చివరకు రైల్వే స్టేషన్‌లో ఉండగా.. అనిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. అఖిల్‌ ఏమయ్యాడని ప్రశ్నించగా.. అసలు విషయం కక్కాడు. పోలీసులను తీసుకెళ్లి ఇదిగో ఇక్కడే పూడ్చిపెట్టానని చెప్పాడు. పోలీసులు అక్కడ తవ్వించగా.. ఎముకలు, వైరుతో పాటు బాలుడి చొక్కా లభించాయి. వాటి ఆధారంగా మృతదేహాన్ని నిర్ధరించుకున్నారు. ఆస్తి కోసం తన అల్లుడు ఇంత ఘాతుకానికి తెగిస్తాడనుకోలేదంటూ బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలిపించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.