Bride died: పెళ్లయి నెల రోజులైనా కాలేదు. అంతలోనే అంతులేని విషాదం. ఆ నవవధువును చూసి విధికి కన్ను కుట్టిందేమో .. కాళ్లపారాణి ఆరకముందే ఆమెకు నూరేళ్లు నిండాయి. రోడ్డు ప్రమాదం రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు ఆ నవవధువును బలితీసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు మృత్యువాత పడగా.. భర్తకు గాయాలయ్యాయి. జిల్లాలోని తుర్కపల్లి మండలం మాదాపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న బైక్ను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే నవ వధువు మృతిచెందింది. మృతురాలు బద్దుతండాకు చెందిన చిట్టిగా పోలీసులు గుర్తించారు. మృతదేహన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: