ETV Bharat / crime

Attack on Bridegroom House: అమ్మాయిని తీసుకెళ్లాడని అబ్బాయి ఇంటిపై దాడి - metpally crime news

ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న అబ్బాయి కుటుంబంపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. రాళ్లు, కర్రలు, పలు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

bride family members attack on bridegroom house in metpally

author img

By

Published : Aug 1, 2021, 9:41 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణం సింగపూర్​ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెట్​పల్లికి చెందిన పెద్దగొండ ప్రవీణ్, సౌమ్య... గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ నెల 4న హైదరాబాద్​లోని ఆర్య సమాజ్​లో రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు కుటుంబసభ్యులు.. కాసేపటికే రిజిష్టర్​ కార్యాలయానికి చేరుకుని వధువును తీసుకెళ్లిపోయారు. వాళ్లను ఆపలేకపోయిన ప్రవీణ్​.. పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఇరు వర్గాలను పిలిపించిన పోలీసులు.. కౌన్సిలింగ్​ ఇచ్చారు. ఎంత సముదాయించినా.. అమ్మాయి తరఫువాళ్లు రాజీపడలేదు. అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయారు.

అమ్మాయి మళ్ళీ అబ్బాయికి ఫోన్ చేసి తనను తీసుకెళ్లమని కోరగా... సౌమ్యను ప్రవీణ్ తన ఇంటికీ తీసుకొచ్చాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సౌమ్య కుటుంబసభ్యులు... కోపంతో ఊగిపోతూ ప్రవీణ్​ ఇంటిపై దాడి చేశారు. బండరాళ్లు, కర్రలు, గొడ్డలిలాంటి మారణాయుధాలతో దాడి చేయగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో సామగ్రి ధ్వంసమైంది. వెంటనే పోలీసులకు సమాచారమందించగా... హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇరు వర్గాలతో మాట్లాడుతున్నారు.

అబ్బాయి కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి ఇంటిపై దాడి చేసేందుకు సిద్ధం కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వాళ్లను సముదాయించే ప్రయత్నం చేశారు. సౌమ్య కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని.. ప్రవీణ్​ కుటుంబసభ్యులు ఆరోపించారు. మారణాయుధాలతో దాడి చేయటం వల్ల గాయాలయ్యాయని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే తమపై ఇలా దాడి జరిగితే.. ఇక తమకు రక్షణ ఏదని ప్రశ్నించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.