ETV Bharat / crime

Boy killed dogs at KBR park: మొన్న కుక్కపిల్లలను చంపాడు.. ఇప్పుడేమో పావురాలను.. - boy selling doves at kbr park

పెంపుడు జంతువులను చూస్తే ఏ చిన్నారులకైనా వాటితో ఆడుకోవాలని ఉంటుంది. సరదాగా వాటితో సమయం గడపాలనుకుంటారు. బిస్కెట్లు, గింజలు వేసి వాటిని మచ్చిక చేసుకోవాలని చూస్తారు. కానీ ఈ బాలుడు మాత్రం వాటికి విరుద్ధం. మూగ జీవుల పట్ల నిర్దయగా వ్యవహరించడం అతని నైజం. అందుకే నాలుగు రోజుల క్రితం మూడు కుక్కపిల్లలను(Boy killed dogs at KBR park) పొట్టన బెట్టుకున్నాడు. ఇప్పుడు పావురాలను అమ్మేందుకు యత్నించాడు. హైదరాబాద్​ కేబీఆర్​ పార్కు వద్ద.. ఇటీవల కనిపించిన దృశ్యాలివి.

Boy killed dogs at KBR park
కుక్క పిల్లలను చంపుతున్న బాలుడు
author img

By

Published : Nov 26, 2021, 3:27 PM IST

Boy killed dogs at KBR park: హైదరాబాద్​ జూబ్లీహిల్స్​​లోని కేబీఆర్ పార్కు వద్ద మరో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం రోడ్డు పక్కన ఆడుకుంటున్న కుక్క పిల్లలను చంపిన బాలుడు.. ఇప్పుడు పావురాలను అమ్మేందుకు యత్నించాడు. గమనించిన వాకర్లు పోలీసులకు సమాచారం అందిచడంతో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

కేబీఆర్ ఉద్యానవనం నుంచి జూబ్లీహిల్స్ చెక్​పోస్టు వెళ్లేదారిలో జీహెచ్ఎంసీ వాక్ వే వద్ద ఉన్న మూడు కుక్కపిల్లలను నాలుగు రోజుల క్రితం రబ్బరు బెల్టుతో ఓ బాలుడు కొట్టి చంపాడు. ఆ దారిలో వాకింగ్​ చేస్తున్న ఓ వ్యక్తి.. అది గమనించి బాలుడిని పట్టుకునే లోగా అక్కడినుంచి పరారయ్యాడు. గమనించిన ఇంటర్​సెప్టార్​ పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు.

పద్ధతి మారలేదు

ఇంత జరిగినా ఆ బాలుడు పద్ధతి మార్చుకోలేదు. తాజాగా పార్కు వద్దకు వచ్చి పావురాలను పట్టుకుని విక్రయించేందుకు యత్నించాడు. ఆ అబ్బాయి పావురాలను అమ్మడాన్ని గమనించిన వాకర్లు.. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతు సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ హోమ్​కు తరలిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Beggars Conflict in train: రైల్లో యాచకుల మధ్య ఘర్షణ... భయాందోళనలో ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.