చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరిగిపోతుంది. తాజాగా ఓ విద్యార్థి తన ప్రేమలేఖ విషయం టీచర్లకు తెలిసిందని ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ పహాడీషరీఫ్ పరిధిలో చోటుచేసుకుంది.
ఇదీ జరిగింది... ఇప్పుడున్న పరిస్థితులు, ఇంటర్నెట్, మొబైల్.. ఇవన్నీ పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. చిన్నతనంలోనే ఆకర్షణను ప్రేమ అనుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థినికి ప్రేమ లేఖ రాశాడు. అది స్కూల్ టీచర్ల వద్దకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు.. తన పరువు పోతుందని భావించాడు. అంతే కాదు ఈ విషయం తన తల్లిదండ్రులకు చేరుతుందని భయపడ్డాడు.
దీంతో మనస్తాపానికి చెందిన ఆ 14ఏళ్లు బాలుడు చావే పరిష్కారమనుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్ల ముందు రోజూ హుషారుగా తిరిగే కుమారుడు.. విగతజీవిగా ఉండే సరికి తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో.. తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.
ఇవీ చదవండి: