ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష - jaggareddy district latest news
నకిలీ బిల్లులు సృష్టించి ఇన్సురెన్స్ కంపెనీని మోసం చేసిన కేసులో ఇద్దరికి ఎల్బీనగర్ కోర్టు మూడేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది.

నకిలీ బిల్లులతో ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేసిన ఇద్దరు నిందితులకు మూడెళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. ఎల్బీనగర్ కోర్టు తీర్పునిచ్చింది. జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది. ఎల్బీనగర్కు చెందిన రవికుమార్ ఈ- ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి టర్మ్ ఇన్సరెన్స్ పాలసీ తీసుకోగా 2014లో ఆ గడవు ముగిసింది.
అయినప్పటికీ భార్య చికిత్స పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి రూ.36వేలు అక్రమంగా కంపెనీ నుంచి పొందాడు. ఇందుకోసం చైతన్యపురి గుడ్ లైఫ్ ఆస్పత్రి ఉద్యోగి యాకన్న అతనికి సహకరించాడు. అనుమానం వచ్చిన కంపెనీ సహాయ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేసి కోర్టుకు ఆధారాలను సమర్పించారు. విచారణ జరిపిన ధర్మాసనం నిందితులిద్దరికీ మూడేళ్ల శిక్షతో పాటుగా జరిమానా విధించింది.
ఇదీ చదవండి: ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తా: వైఎస్ షర్మిల