ETV Bharat / crime

అచ్చంపేటలో 830 కిలోల నల్లబెల్లం పట్టివేత

నాగర్​కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో 830 కిలోల నల్లబెల్లాన్ని ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యాపారుల నుంచి సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

author img

By

Published : Apr 5, 2021, 7:42 PM IST

black jaggery seied, nagarkurnool enforcement
అచ్చంపేటలో నల్లబెల్లం స్వాధీనం, నాగర్​ కర్నూల్​లో నల్లబెల్లం స్వాధీనం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మహబూబ్​నగర్ జిల్లా ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలో ఇద్దరు వ్యాపారుల నుంచి 830కిలోల నల్లబెల్లాన్ని పట్టుకున్నారు. నాటు సారా తయారీ కోసం ఉపయోగించే బెల్లం, 80కిలోల పటికను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

నాటుసారా కోసం నల్లబెల్లం విక్రయించడం చట్టరీత్యా నేరమని ఎన్​ఫోర్స్​మెంట్ సీఐ గణపతి రెడ్డి తెలిపారు. పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఈతకెళ్లి క్వారీ నీటిలో చిక్కుకొని.. బాలుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.