ETV Bharat / crime

ధర్పల్లిలో ఉద్రిక్తత.. రాళ్లతో భాజపా, తెరాస వర్గాల పరస్పర దాడి - BJP and TRS activists fight

నిజామాబాద్: ధర్పల్లిలో ఉద్రిక్తత
నిజామాబాద్: ధర్పల్లిలో ఉద్రిక్తత
author img

By

Published : Feb 19, 2022, 11:16 AM IST

Updated : Feb 20, 2022, 10:59 AM IST

11:14 February 19

నిజామాబాద్: ధర్పల్లిలో ఉద్రిక్తత

ధర్పల్లిలో ఉద్రిక్తత.. రాళ్లతో భాజపా, తెరాస వర్గాల పరస్పర దాడి

BJP and TRS Activists Fight: నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో శనివారం శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెరాస, భాజపా కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్‌, సర్పంచికి గాయాలయ్యాయి. విగ్రహావిష్కరణకు ఎంపీ అర్వింద్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీటీసీ సభ్యుడు జగన్‌ను ఎందుకు ఆహ్వానించలేదంటూ సర్పంచి పెద్దబాలరాజ్‌(తెరాస), ఉపసర్పంచి భారతీరాణి(తెరాస), పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఎంపీ రాకముందే విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ భాజపా కార్యకర్తలు, నాయకులు మరోసారి ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు విసురుకోవడంతో ఎస్సై వంశీకృష్ణారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. ఆయననూ, గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ లలితను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సుమారు 4 గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భాజపా నాయకులు ర్యాలీ నిర్వహించగా.. తెరాస వారు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అదనపు డీసీపీ వినీత్‌ ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఇరువర్గాలపై; దాడిలో ముగ్గురికి గాయాలైనందుకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం తమదంటూ ఆర్టీసీ నిజామాబాద్‌ డీఎం కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిపాల్‌, రాజు, అక్షయ్‌ సహా మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.

‘పోలీసులు అధికార తెరాస మాట వినేది ఇంకా నెలన్నర రోజులేనని’ డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. తెరాస దాడులకు భాజపా కార్యకర్తలు భయపడరని.. ఆత్మరక్షణ కోసం తామూ అదే పని చేస్తామని హెచ్చరించారు.

అర్వింద్‌ బాధ్యత వహించాలి: బాజిరెడ్డి

ధర్పల్లి ఘటనకు ఎంపీ అర్వింద్‌ బాధ్యత వహించాలని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ఎంపీని రైతులు ప్రశ్నించారని.. తెరాస కార్యకర్తలే రైతు కండువాలు వేసుకుని గొడవలు చేస్తున్నారని ఆరోపించడం సరికాదన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 20, 2022, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.