బోయిన్పల్లి అపహరణ కేసులో 17 మంది నిందితుల బెయిల్ పిటిషన్లను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో 17 మంది నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారి తరఫున న్యాయవాదులు సికింద్రాబాద్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని.. కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసుల తరఫున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ను తిరస్కరించింది.
అపహరణ కేసులో ఏ3గా ఉన్న భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డి.. ముందస్తు బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం ఇప్పటికే తిరస్కరించింది. ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్.. హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
ఇవీచూడండి: బోయిన్పల్లి పీఎస్‌కు అఖిలప్రియ.. గంటన్నరపాటు విచారణ