ETV Bharat / crime

రూ. 10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం

నిషేధిత గుట్కా, అంబర్​ ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న నలుగురిని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా సీసీఎస్​​ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన గుట్కా విలువ రూ. 10 లక్షలు ఉంటుందని తెలిపారు.

banned gutka seized
నిషేధిత గుట్కా స్వాధీనం
author img

By

Published : Apr 29, 2021, 8:12 PM IST

Updated : Apr 29, 2021, 8:23 PM IST

కారులో నిషేధిత గుట్కా, అంబర్​ ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాను జయశంకర్​ భూపాలపల్లి జిల్లా సీసీఎస్​ పోలీసులు అరెస్టు చేశారు. ఘనపరం మండలం గాంధీనగర్​ వద్ద కారులో నిర్వహించిన తనిఖీల్లో వీటిని గుర్తించారు. వాహనం సీజ్​ చేసి, రూ. 10 లక్షల విలువ చేసే గుట్కా, అంబర్​ ప్యాకెట్లు, రూ. 3.50 లక్షలు, 4 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వేర్వేరు జిల్లాలకు చెందిన ఈ నలుగురు కిరాణా షాపుల్లో వీటిని నిల్వ చేసి చుట్టు పక్కల గ్రామాలకు తరలిస్తారని పోలీసులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఏటీఎం సిబ్బందిని తుపాకీతో కాల్చి చోరీ

Last Updated : Apr 29, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.