ETV Bharat / crime

Suicide: ఇచ్చిన రుణాలే ప్రాణాలు తీశాయి - ap latest news

Suicide: బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలు రికవరీ కాకపోవడంతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయి. దాంతో తానే అప్పులు చేసి ఖాతాదారుల రుణాలు చెల్లించిన ఓ బ్యాంకు మేనేజరు మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని యానాంలో జరిగింది. అసలేం జరిగిందంటే..?

Suicide
Suicide
author img

By

Published : Oct 12, 2022, 12:09 PM IST

Suicide: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం పడవల వీధిలో ఉన్న యూకో బ్యాంక్ మేనేజర్ 33 ఏళ్ల సాయి రత్న శ్రీకాంత్... భార్య, ఇద్దరు కుమార్తెలతో గోపాల్ నగర్ వద్ద అద్దె భవనంలో నివాసం ఉంటున్నారు. శ్రీకాంత్ తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. యానాం పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్థికపరమైన ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నామన్నారు. గతంలో మచిలీపట్నం బ్రాంచ్​లో మూడేళ్లపాటు మేనేజర్​గా పనిచేసిన సమయంలో చేపల చెరువుల నిర్వహణకు బ్యాంకు తరఫున లోను మంజూరు చేయగా లబ్ధిదారులు సక్రమంగా వాయిదాలు చెల్లించకపోవడంతో... పై అధికారుల ఒత్తిడి మేరకు రూ.50 లక్షలు చెల్లించాడని.. మూడు నెలల క్రితం యానాం బ్రాంచ్​కు బదిలీ చేశారని... ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరో రూ.35 లక్షలు లోన్ ద్వారా తీసుకొని చెల్లించారని కుటుంబ సభ్యులు చెప్పినట్టు తెలిపారు. అయినా పై అధికారుల ఒత్తిడి పెరగడంతో తీవ్రమైన మానసిక శోభకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.