నిర్మల్ జిల్లా భైంసా ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక బాలింత మృతి (Balintha Died) చెందిన ఘటన చోటుచేసుకుంది. కుబీర్ మండలం బెల్గం తండాకు చెందిన రేష్మకు ఆదివారం మధ్యాహ్నం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబసభ్యులు బాలింతను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
రాత్రి ఒంటి గంట సమయంలో రేష్మకు సాధారణ ప్రసవమై.. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం 4 గంటల వ్యవధిలోనే బాలింత మృతి (Balintha Died) చెందింది. వైద్యులు అందుబాటులో లేక పోవడం వల్లనే రేష్మ మృతి (Balintha Died) చెందిందని ఆరోపిస్తూ.. కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడం వల్లనే బాలింత మృతి (Balintha Died) చెందిందని ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి.. తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు.
ఇదీ చూడండి: పురిటినొప్పులతో వెళ్తే 22 లక్షల బిల్లు.. అయినా శిశువు మృతి, బాలింత పరిస్థితి విషమం
పది రోజులు మృత్యువుతో పోరాటం.. ప్రాణాలొదిలిన బాలింత
కాన్పుకోసం వచ్చి.. ఎనిమిది రోజులుగా కోమాలోనే
Pregnancy Woman Died: ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి... సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆందోళన