ETV Bharat / crime

2017 నుంచి దందా... 8కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం - 140 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం

విశ్వసనీయ సమాచారం ప్రకారం డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 140 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు.

balanagar-zone-dcp-padmaja-press-meet-on-drugs-case-in-medchal-district
2017 నుంచి దందా... 8కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం
author img

By

Published : Mar 15, 2021, 5:42 PM IST

2017 నుంచి దందా... 8కోట్లు విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం

మేడ్చల్ జిల్లా పేట్‌బషీరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టైంది. విశ్వసనీయ సమాచారం మేరకు డ్రగ్స్ తయారుచేసి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 140 కిలోల అల్ర్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 8 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

లింగ గౌడ్, వినోద్‌, రామకృష్ణ గౌడ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా... మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 50వేల నగదు, రెండు కార్లు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఏ1 నిందితుడిగా ఉన్న లింగ గౌడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేశాడు. డ్రగ్స్‌ను కల్లు దుకాణాలకు సరఫరా చేసేవాడు. లింగగౌడ్‌కు వినోద్, రామకృష్ణ గౌడ్ సహకరించేవారు. 2017 నుంచి డ్రగ్స్ అక్రమ వ్యాపారం సాగుతోంది.

- బాలానగర్ డీసీపీ పద్మజ

ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పద్మజ తెలిపారు. నలుగురు నిందితులలో కిరణ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్​కు తరలించామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 140 కిలోల సింథటిక్ డ్రగ్స్ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.