ETV Bharat / crime

ఆటో, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి - సిద్దిపేట జిల్లా కోమటిబండ వద్ద ప్రమాదం

పనిమీద వెళ్తూ వెళ్తూ మిత్రుడిని తోడు తీసుకెళ్లాడు. అదే చివరి ప్రయాణం అవుతుందని కలలోనూ ఊహించి ఉండడు. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఓ ఆటో తన ప్రాణాన్ని తీసుకెళ్లింది. మిత్రుడికీ తీవ్ర గాయాలయ్యాయి. తూప్రాన్-గజ్వేల్ రహదారిపై కోమటిబండ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

auto-bike-accident-at-komatibanda-in-siddipet-and-one-person-died
ఆటో, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి
author img

By

Published : Feb 12, 2021, 10:31 PM IST

ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొట్టగా.. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద జరిగింది.

మర్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన మహంకాళి సతీశ్​(24) తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఫైనాన్స్​ డబ్బులను చెల్లించడానికి తూప్రాన్ వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మిత్రుడు హరీశ్​నూ తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గమధ్యలో తూప్రాన్-గజ్వేల్ రహదారిపై కోమటిబండ వద్ద గ్రామం నుంచి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఆటోను సతీశ్​ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది.

ఈ ఘటనలో సతీశ్​ అక్కడికక్కడే మృతి చెందగా.. హరీశ్​కు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో హరీశ్​ను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆంజనేయులు తెలిపారు.

ఇదీ చూడండి: నకిలీ ధ్రువపత్రాలతో రూ. 2 కోట్లకు టోకరా.. ఫిర్యాదుతో వెలుగులోకి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.