ఏటీఎం చోరీకి పాల్పడ్డ ఇద్దరు దొంగలను మేడ్చల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 29న ఉప్పల్ మండలం నాచారంలో మాణిక్ చంద్ కూడలి వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఏంలో... కొంతం సాయి కిరణ్ రెడ్డి, రాంచరణ్ డబ్బులు దొంగిలించేందుకు యత్నించారు.
వారి ప్రయత్నం విఫలయత్నం కావడం వల్ల ఇద్దరు దొంగలు ఏటీఎం మిషన్ను స్పల్పంగా ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఘట్ కేసర్ పోలీసులు... సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: పెళ్లి సంబంధాల పేరిట లక్షలు దోచుకుంటున్న మహిళ