ETV Bharat / crime

బంగారం దోపిడీకి సినిమా స్టైల్​లో ప్లాన్​ చేశారు, చివరి నిమిషంలో సీన్ రివర్స్

Movie style theft in nellore సినిమాల ప్రభావం జనాల మీద బాగానే కనిపిస్తోంది. సినిమాల్లో చేసే పనులను నిజ జీవితంలోనూ చేసి చూపిస్తున్నారు కొందరు. అది మంచి పనైనా, చెడ్డ పనైనా తగ్గేదే లే అంటున్నారు. ఓ సినిమాలో హీరో సీబీఐ ఆఫీసర్​నంటూ నమ్మించి నగల దుకాణంలోని నగలన్నీ కొట్టేస్తాడు. అచ్చం అలాగే చేసేందుకు ఓ గ్యాంగ్​ ప్లాన్​ చేసి, రంగంలోకి దిగింది. పని పూర్తి చేసుకుని వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుండగా కథ అడ్డం తిరిగింది. కట్​ చేస్తే పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కబెడుతోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ, ఎలా జరిగిందంటే

బంగారం దోపిడీకి సినిమా స్టైల్​లో ప్లాన్​ చేశారు, చివరి నిమిషంలో సీన్ రివర్స్
బంగారం దోపిడీకి సినిమా స్టైల్​లో ప్లాన్​ చేశారు, చివరి నిమిషంలో సీన్ రివర్స్
author img

By

Published : Aug 26, 2022, 7:23 PM IST

Movie style theft in nellore: ఐటీ అధికారులమని చెప్పి భారీ దోపిడీకి యత్నించిన కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని చిన్నబజార్‌ కాకర్ల వారి వీధిలోని లావణ్య జ్యువెల్లరీ దుకాణంలోకి శుక్రవారం ఐటీ అధికారులమంటూ ఆరుగురు వ్యక్తులు ప్రవేశించారు. తనిఖీలు చేయాలంటూ దుకాణంలో హడావిడి చేశారు. లెక్కల్లో కంటే ఎక్కువ బంగారం ఉందని 12 కిలోల బంగారం మూటకట్టుకుని పరారయ్యేందుకు యత్నించారు.

వారి తీరుపై అనుమానం వచ్చిన దుకాణం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పరారయ్యేందుకు ప్రయత్నించిన దొంగలను స్థానికుల సహకారంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టపగలే అధికారుల పేరు చెప్పి భారీ దోపిడీకి యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. నిందితులను పోలీస్​స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

ఇవీ చదవండి..:

వైద్య విద్యార్థిని ప్రాణం తీసిన బస్సు పరిచయం

న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం అదే కావాలన్న జస్టిస్ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.