ETV Bharat / crime

కత్తలతో బెదిరించి దారి దోపిడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్​ - దొపిడీ దొంగలను అరెస్ట్​ చేసిన పోలీసులు

కత్తులతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి కత్తి, సెల్​ఫోన్​లు సహా రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ముంబాయి, యూపీలలో ఈ తరహా కేసులు ఉన్నాయని నగర సంయుక్త సీపీ తెలిపారు.

Arrest of two robbers in Hyderabad
కత్తలతో బెదిరించి దారి దోపిడి.. ఇద్దరి అరెస్ట్​
author img

By

Published : Mar 20, 2021, 5:48 PM IST

హైదరాబాద్​లో కత్తులతో బెదిరించి దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ బ్యాగు, కత్తి, రెండు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్‌జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.

నిందితులు మహ్మద్‌ సైఫుల్లా, మిర్జా అరూమ్‌ బేగ్‌ ఈ నెల 15న హుమాయూన్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కారులో వెళుతున్న ఓ వ్యక్తిని అడ్డగించి కత్తితో బెదిరించి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారని సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. మరుసటి రోజు తెల్లవారు జామున బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ మహిళపై దాడి చేసి ఆమె బ్యాగును తస్కరించారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సీసీ కెమెరాల సహాయంతో నిందితులను పట్టుకున్నామని చెప్పారు. ఈ నిందితులపై గతంలో ముంబాయి, ఉత్తర్‌ప్రదేశ్‌లో పలు కేసులు ఉన్నాయని వివరించారు.

ఇదీ చదవండి: రేషన్ డీలర్స్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షుడిగా పద్మారావుగౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.