ఇన్‌స్టాగ్రామ్‌లో యువతి పేరుతో నకిలీ ఖాతా తెరిచి అసభ్యకర ఫొటోలను పెడుతూ వేధింపులకు గురిచేస్తోన్న మణిప్రసాద్ అనే కొరియోగ్రాఫర్‌ను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఓ షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన యువతితో మణిప్రసాద్కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో యువతి మణిప్రసాద్తో మాట్లాడటం మానేసింది.
కక్ష పెంచుకున్న మణిప్రసాద్ తన వద్ద ఉన్న యువతి ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.