ETV Bharat / crime

కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు.. కరోనాతో తండ్రి మృతి - Father dies with Corona

ఉప్పల్‌లో కొవిడ్‌ బారిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆసుప్రతిలో చేర్పించాలన్న ప్రయత్నం ఫలించలేదు..చివరకు అంబులెన్స్‌లోనే కన్నుమూశాడు. భరత్‌నగర్‌కు చెందిన ఈగ నర్సింగ్‌రావు ముదిరాజ్‌కు భార్య, ఇద్దరు కుమారులు, కుమారై ఉన్నారు. మే 13న కుమారై వివాహం జరగనుంది. ఈ తరుణంలో ఇలా జరగడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Father dies with Corona,  uppal crime news today
కుమార్తె పెళ్లికి ఏర్పాట్లు.. కరోనాతో తండ్రి మృతి
author img

By

Published : Apr 30, 2021, 8:48 AM IST

కుమార్తె పెళ్లికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఇంతలోనే కరోనా రూపంలో మృత్యువు ఇంటి పెద్దను కబళించిన ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో చోటు చేసుకుంది. ఉప్పల్‌లోని భరత్‌నగర్‌కు చెందిన ఈగ నర్సింగ్‌రావు ముదిరాజ్‌(48)... ఉప్పల్‌ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మే 13న కుమార్తె వివాహం జరగనుంది.

ఈ నేపథ్యంలో వివాహ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఐదారు రోజుల క్రితం నర్సింగ్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం రాత్రి ఆరోగ్యం విషమించడం వల్ల.. మరో ఆసుపత్రిలో చేర్పించేందుకు అంబులెన్స్‌లో తీసుకుని బయలు దేరారు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా పడకలు లేవనే సమాధానమే వచ్చింది. రాత్రంతా ప్రయత్నించినా ఏ ఆసుపత్రిలోనూ ఆయన్ను చేర్చుకోలేదు. చివరకు తీసుకెళ్లిన అంబులెన్స్‌లోనే తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు.

ఇదీ చూడండి: రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ పేరిట మోసం... వైద్యుడు, కాంపౌండర్‌ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.