ETV Bharat / crime

వ్యాయామం చేసి ఇంటికి వచ్చాక కుప్పకూలిన జవాను.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే! - telangana crime news

Soldier Died After Exercise: శరీరం ఫిట్​గా ఉండేందుకు వ్యాయామం, డైట్​.. ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు. అయినా చావు ఎప్పుడు, ఎలా వస్తుందో చెప్పలేము. ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉండే కన్నడ సూపర్​ స్టార్​ పునీత్​ రాజ్​ కుమార్​.. వ్యాయామం చేస్తూ మృతి చెందడం.. ఎంతో మంది గుండెల్లో విషాదం నింపింది. సరిగ్గా అలాంటి విషాదమే ఓ ఆర్మీ కుటుంబంలో చోటుచేసుకుంది.

Soldier Died After Exercise
వ్యాయామం చేశాక జవాను మృతి
author img

By

Published : Apr 8, 2022, 8:38 AM IST

Soldier Died After Exercise: వ్యాయామం చేసి ఇంటికి వచ్చిన కాసేపటికే ఓ జవాను కుప్పకూలి మృతి చెందిన విషాద ఘటన సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఆర్మీలో లాన్స్ నాయక్ హోదాలో కొనసాగుతున్న కుమార్.. జిమ్​లో వ్యాయామం చేసి ఇంటికి తిరిగివచ్చాక ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. తమిళనాడులోని వేలూరు జిల్లా కరైకుడెం గ్రామానికి చెందిన వి. కుమార్(30).. ప్రస్తుతం నగరంలో నివాసం ఉంటున్నారు. న్యూ బోయిన్​పల్లి ఓల్డ్ ఎయిర్​పోర్టు రోడ్డులోని క్వార్టర్స్​లో భార్య రఘుప్రియ, మూడేళ్ల కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఏఓసీ సెంటర్లో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్న కుమార్.. తరచూ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంటుంటారు. రోజూలాగే ఈనెల 6 న సాయంత్రం ఏఓసీ సెంటర్​లోని జిమ్​కు వెళ్లి వ్యాయామం చేసి ఇంటికి తిరిగివచ్చారు. అనంతరం కుర్చీలో కూర్చున్నారు. ఆ కాసేపటికి కుమార్​ భార్య రఘుప్రియ.. మంచినీళ్లు తేవాలా అని అడగడంతో.. కుర్చీలో కూర్చున్న కుమార్ పైకిలేచి ఒక్కసారిగా కుప్పకూలారు.

దీంతో అప్రమత్తమైన రఘుప్రియ.. హుటాహుటిన స్థానికుల సహాయంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి తిరుమలగిరిలోని మిలిటరీ ఆస్పత్రికి తరలించగా కుమార్​.. అప్పటికే మృతిచెందారని వైద్యులు నిర్ధరించారు. రఘుప్రియ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ తల్లిదండ్రులకు తీరని వేదన.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.