ETV Bharat / crime

కేరళలో ఏపీ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ఆరా తీసిన సీఎం జగన్‌ - కేరళలోని పతనంమిట్ట

శబరిమల వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఏపీకి చెందిన యాత్ర బస్సు కేరళ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సీఎం జగన్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు ఇబ్బంది లేకుండా వైద్యంతో పాటు సరైన సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

కేరళలో ఏపీ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ఆరా తీసిన సీఎం జగన్‌

author img

By

Published : Nov 19, 2022, 2:04 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ప్రయాణిస్తున్న శబరిమల యాత్ర బస్సు కేరళలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. సీఎంవో అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తులు శబరిమల యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా కేరళలోని పతనంథిట్ట వద్ద ప్రమాదానికి గురైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. 84 మంది భక్తులు రెండు బస్సుల్లో శబరిమల వెళ్లారని.. తిరిగి వస్తున్న సమయంలో ఇవాళ ఉదయం 8 గంటలకు ఒక బస్సు ప్రమాదానికి గురైందని చెప్పారు.

కేరళలో ఏపీ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ఆరా తీసిన సీఎం జగన్‌

ప్రమాదానికి గురైన బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారిలో నలుగురు గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వారిని కొట్టాయం వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీఎంకు వివరించారు. మిగిలిన యాత్రికులకు వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామని.. పతనంథిట్ట అధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సీఎంవో అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులకు ఇబ్బంది లేకుండా వైద్యంతో పాటు సరైన సహాయం అందేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

ఇవీ చదవండి..:

ఏపీలో రోడ్డు ప్రమాదం.. వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతుల మృతి

19ఏళ్ల మోడల్​పై దారుణం.. కారులో నగరమంతా తిప్పుతూ గ్యాంగ్​రేప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.