AP MP Nandigam Suresh : విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌తో పాటు ఆయన అనుచరులు హల్‌చల్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తాము ఎంపీ నందిగం సురేశ్ అనుచరులమంటూ యువకులు హంగామా చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ సురేశ్ పోలీసులతో మాట్లాడేందుకు పీఎస్‌కు వెళ్లారు. స్టేషన్‌లో పోలీసులతో ఎంపీ బాహాబాహీకి దిగేలా పరిస్థితులు తలెత్తాయి.
AP MP Nandigam Suresh Hulchul in PS : ఈ క్రమంలో ఎస్సైతో ఎంపీ అనుచరులు వాగ్వాదానికి దిగారు. వీడియో తీస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఎంపీ అనుచరులు కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని బయటకు వెళ్లారు. తన ఫోన్ అడిగిన కానిస్టేబుల్‌పై మళ్లీ చేయిచేసుకున్నారు. యువకుల్లో ఎంపీ సురేశ్ సమీప బంధువు ఉన్నట్లు తెలుస్తోంది.