రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో పరారీలో ఉన్న కృష్ణారెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డిపాజిట్ల గోల్‌మాల్‌లో సాయికుమార్, కృష్ణారెడ్డి కీలకపాత్ర వహించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. కృష్ణారెడ్డి స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో నివాసముంటున్నారని పోలీసులు తెలిపారు.
సాయి కుమార్‌తో కలిసి డిపాజిట్లు కొల్లగొట్టడంలో కృష్ణారెడ్డి కుట్ర పన్నినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలుగు అకాడమీతో పాటు ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లోనూ రూ.15 కోట్లకు పైగా డిపాజిట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్ల గోల్‌మాల్‌లో తన వాటాగా కృష్ణారెడ్డి ఆరు కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉండగా.. 3.5 కోట్లు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించినట్లు వెల్లడించారు. గతంలో ఏపీ వేర్‌హౌసింగ్‌లో రూ.10 కోట్ల గోల్‌మాల్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లో రూ.5 కోట్ల గోల్‌మాల్‌లో కృష్ణారెడ్డి పాత్ర ఉంది. కృష్ణారెడ్డి తీసుకున్న సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు 16మందిని అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో ఇవాళ్టితో 8 మంది నిందితుల కస్టడీ ముగియగా వారిని నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ శాఖల్లో కొల్లగొట్టిన డిపాజిట్లను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
సాయి కుమార్‌తో కలిసి డిపాజిట్లు కొల్లగొట్టడంలో కృష్ణారెడ్డి కుట్ర పన్నినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలుగు అకాడమీతో పాటు ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లోనూ 15 కోట్లకు పైగా డిపాజిట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు అకాడమీ డిపాజిట్లలలో కృష్ణారెడ్డి తన వాటాగా మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. మిగతా ప్రభుత్వ శాఖలకు చెందిన డిపాజిట్లను కొల్లగొట్టిన ఘటనల్లోనూ కృష్ణారెడ్డి కోట్ల రూపాయల్లో వాటాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణారెడ్డి తీసుకున్న సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటికే సీసీఎస్ పోలీసులు 16మందిని అరెస్ట్ చేశారు. ఈ నెల 6వ తేదీన అరెస్ట్ చేసిన సాయి కుమార్ ముఠాలో 8మందిని రెండో విడత కస్టడీలోకి తీసుకొని సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. నేటితో వాళ్ల కస్టడీ గడువు ముగియడంతో నాంపల్లి కోర్టులో హాజరుపర్చి.. చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ శాఖల్లో కొల్లగొట్టిన డిపాజిట్లను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నారు. నిందితుల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి:
TELUGU ACADEMY FD SCAM : తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్దే కీలకపాత్ర..: సీపీ