ETV Bharat / crime

హత్య చేశాడు.. కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు.. చివరికి..! - sangareddy district crime news

ఆస్తి కోసం సొంత అన్నను చంపి, పాతిపెట్టాడు. ఏమీ తెలియనట్లు అమ్మతో కలిసి అన్న కనిపించడం లేదంటూ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కటకటాలపాలయ్యాడు.

thadmanur murder case
హత్య కేసును ఛేదించిన పోలీసులు
author img

By

Published : Mar 28, 2021, 4:44 PM IST

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తాడ్​మనూర్ గ్రామానికి చెందిన మ్యాతరి ఏసు అనే వ్యక్తి కనిపించడం లేదంటూ జోగిపేట పోలీస్​స్టేషన్​లో గతేడాది సెప్టెంబర్​లో నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. స్నేహితులతో కలిసి సొంత తమ్ముడే అన్నను హత్య చేసి పాతిపెట్టినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు రాజు, అతని స్నేహితుడు తలారి నవీన్​ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంగారెడ్డి జిల్లా డీఎస్పీ బాలాజీ కేసు వివరాలను వెల్లడించారు.

తాడ్​మనూర్ గ్రామానికి చెందిన ఏసు, రాజు అన్నదమ్ములు. వీరికి రెండున్నర ఎకరాల పొలం ఉంది. అన్న ఏసు పొలం పనులు చూసుకుంటుండగా‌.. తమ్ముడు రాజు కారు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన రాజు.. ఆస్తిని పంచాలని తరచూ అన్నతో గొడవపడేవాడు. ఆస్తి విషయంలో ఏసు కఠినంగా వ్యవహరించడంతో ఉపాధి కోసం రాజు సంగారెడ్డికి వెళ్లిపోయాడు.

అలా పథకం రచించారు..

అన్న ఉంటే ఆస్తి తనకు దక్కదని భావించిన రాజు.. ఏసును అంతమొందించేందుకు నిర్ణయించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితులను సంగారెడ్డికి పిలిపించుకున్నాడు. అన్నను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. పథకం ప్రకారం రాజు, అతని స్నేహితులు నవీన్, అనిల్, బన్నీలతో కలిసి ఆరు బయట పడుకున్న అన్నను బలవంతంగా కారులో ఎక్కించుకొని సంగారెడ్డి జిల్లా జైరాబాద్ సమీపంలోని చించోలి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడే ఏసును అంతమొందించి.. గొయ్యి తీసి పాతిపెట్టారు.

ఒప్పుకోక తప్పలేదు..

అనంతరం రాజు ఏమీ తెలియనట్టు అన్న కనిపించడం లేదంటూ అమ్మతో కలిసి జోగిపేట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. రాజు వ్యవహార శైలిపై అనుమానమొచ్చిన పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. శవాన్ని పాతిపెట్టిన స్థలాన్ని చూపించాడు. దుస్తుల ఆధారంగా కుటుంబీకులు మృతదేహాన్ని గుర్తించారు.

ఈ మేరకు ప్రధాన నిందితుడు రాజు, అనిల్​ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: అనుమానస్పద స్థితిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.