ETV Bharat / crime

పురుషులు ఎవ్వరితోనూ మాట్లాడబోనని రాసిస్తేనే ....!

'పరాయి పురుషులు ఎవ్వరితోనూ మాట్లాడబోనని రాసిస్తేనే ఇంట్లోకి రా! అలా అయితేనే నా భార్యగా ఉండు' అని అల్టిమేటమ్ ఇచ్చేశాడు ఓ భర్త. అందుకు భార్య నిరాకరించిన తీరుతో.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో కలకలం సృష్టించింది.

ananthapuram-husband-attack-wife-with-knife

author img

By

Published : Aug 8, 2021, 8:23 PM IST

Updated : Aug 9, 2021, 9:38 AM IST

ఈ ఘటన.. పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనం. అనుమానాన్ని మించిన ఉన్మాదం. పదిహేనేళ్ల అన్యోన్య దాంపత్యాన్ని మరిచిపోయేలా చేసిన కిరాతకం. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఆంథోనీ కాలనీలో ఈ అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికుడైన రజాక్ కు.. అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏల్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఈ క్రమంలో.. తన భార్య ఎవరితో మాట్లాడినా రజాక్ అనుమానపడేవాడు. ఇదే విషయంపై తరచూ గొడవలు జరిగేవి. గతంలోనూ ఓ సారి రజాక్.. షర్మిలపై దాడి చేశాడు. పుట్టింటికి వెళ్లిపోయిన షర్మిల.. పెద్దల ఒత్తిడితో కొన్నాళ్ల క్రితం మళ్లీ భర్త దగ్గరికి చేరింది. అప్పుడు కూడా మరోసారి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పరాయి పురుషులతో మాట్లాడబోనని కాగితంపై రాసి ఇస్తేనే ఇంట్లో ఉండాలని రజాక్ అల్టిమేటమ్ ఇచ్చేశాడు. అందుకు అంగీకరించని షర్మిలపై.. రజాక్ హత్యాయత్నానికి ఒడిగట్టాడు.

ఆవేశంలో విచక్షణ కోల్పోయిన రజాక్.. ఇంట్లో ఉన్న కత్తితో షర్మిల మెడపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను.. కుటుంబీకులు గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం.. అనంతపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. రజాక్ ప్రవర్తనపై బాధితురాలి కుటుంబీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనపై వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అలా ఉంటానని రాసివ్వనందుకు భర్యను కత్తితో పొడిచాడు..!

ఇదీ చదవండి:

Last Updated : Aug 9, 2021, 9:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.