ETV Bharat / crime

Murder at jagadgirigutta: మద్యం మత్తులో దాడి... చికిత్స పొందుతూ మహిళ మృతి - మద్యం మత్తులో మహిళపై దాడి

Murder at jagadgirigutta: మద్యం సేవిస్తే మనిషి పశువుగా ఎలా మారతాడో ఈ ఘటన కళ్లకు కట్టింది. తాగిన మైకంలో ఓ దుండగుడు .. పొట్టకూటి కోసం రొట్టెలు చేసుకుంటున్న మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Murder at jagadgirigutta
మద్యం మత్తులో మహిళపై దాడి
author img

By

Published : Feb 28, 2022, 2:23 PM IST

Murder at jagadgirigutta: మద్యం మత్తులో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రోడ్డుపై జొన్న రొట్టెలు చేసుకుంటున్న మహిళను అతి దారుణంగా పొడిచి చంపాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్టలో జరిగింది.

అసలేం జరిగిందంటే...

జగద్గిరిగుట్ట షిరిడీ హిల్స్‌కు చెందిన కవిత(35) తన ఇంటి ముందు జొన్న రొట్టెలు చేస్తూ... వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఆల్విన్ కాలనీకి చెందిన గ్యాస్ సప్లయర్ యాదగిరి మద్యం మత్తులో ఆమె వద్దకు వచ్చి గొడవకు దిగాడు. అనంతరం తాగిన మైకంలో ఆమెను మెడ, కడుపులో పొడిచాడు. పారిపోయేందుకు యత్నించిన యాదగిరిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కవితను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఒకసారి కవిత కుటుంబసభ్యులపై దాడికి యత్నించాడని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి:Vikarabad Accident: తల్లి చావుకు తానే కారణమంటూ.. తనయుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.