ETV Bharat / crime

రుయాలో అమానవీయం.. కుమారుడి మృతదేహంతో బైక్‌పైనే స్వగ్రామానికి.. - రుయాలో అమానవీయం

ఏపీలోని తిరుపతిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రుయా ఆస్పత్రిలో మృతి చెందిన ఓ బాలుడి మృతదేహాన్ని వేరే వాహనంలో తీసుకెళ్లకుండా ఆసుపత్రి అంబులెన్స్​ సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. దీంతో చేసేదేమీలేక ద్విచక్ర వాహనంపైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

రుయాలో అమానవీయం.. కుమారుడి మృతదేహంతో బైక్‌పైనే స్వగ్రామానికి..

author img

By

Published : Apr 26, 2022, 12:44 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ, కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా.. రూ.10వేలు అవుతుందని చెప్పారు. అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను రుయాకు పంపారు.

రుయాలో అమానవీయం.. కుమారుడి మృతదేహంతో బైక్‌పైనే స్వగ్రామానికి..

ఈ క్రమంలో ఆ అంబులెన్స్‌ డ్రైవర్‌ను రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు కొట్టి పంపేశారు. తమ అంబులెన్స్‌ల్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లానని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీలేక ద్విచక్రవాహనంలోనే కుమారుడిని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్స్‌ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు గానీ.. పోలీసులు గానీ చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి..

నేను డాక్టర్‌ని.. నన్నే ఆపుతారా.. మీ సంగతి చెప్తా!

మహిళపై సామూహిక హత్యాచారం.. అడవిలోకి తీసుకెళ్లి 12 ఏళ్ల బాలికపై..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.