ETV Bharat / crime

బైక్​ను ఢీ కొన్న అంబులెన్స్.. వ్యక్తి మృతి - బైక్​ను ఢీ కొన్న అంబులెన్స్

ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన అంబులెన్స్ ఓ బైక్​ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

road accident
road accident
author img

By

Published : May 18, 2021, 9:10 AM IST

వేగంగా వచ్చిన అంబులెన్స్ ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

తనికెళ్ళ గ్రామానికి చెందిన తిరుపతిరావు.. కొనిజర్లలో నిత్యావసరాలు కొనుగోలు చేసి బైక్​పై ఇంటికి తిరిగి పయనమయ్యాడు. ఎదురుగా వస్తోన్న ఓ అంబులెన్స్ బైక్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. తొలుత ఘటనకు పాల్పడ్డ అంబులెన్స్​లోనే ఆక్సిజన్ అమర్చారు. ఆ తర్వాత మరో వాహనంలో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

రక్తపు మడుగులో ఉన్న తిరుపతి రావును చూసి.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అంబులెన్స్ టైర్లు పగలడంతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: చేవెళ్లలో వ్యక్తి దారుణ హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.