కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మద్యం కల్తీ చేస్తున్నారనే సమాచారం మేరకు అబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కాగజ్నగర్ పట్టణం పోచమ్మ బస్తీలోని రాంటెంకి అశోక్ ఇంట్లో అధికారులకు మూడు మద్యం కాటన్లు లభించాయి. వాటిలో నీళ్లు కలిపి కల్తీ చేశారు. మిగతా వాటిని కల్తీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు.
వాటిపై అధికారులు విచారణ చేపట్టగా.. ఆ మద్యం సీసాలను స్థానిక వైన్స్ నుంచి తిరుపతి, రవి అనే వ్యక్తులు తీసుకువచ్చి కల్తీ చేసిన అనంతరం తిరిగి తీసుకువెళ్తారని విచారణలో తేలినట్లు సీఐ మహేందర్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు చెప్పిన ఆయన.. ఇందులో ప్రమేయం ఉన్నవారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదీ చదవండి: రహస్యంగా ఆన్లైన్ మట్కా గేమ్.. యువకులు అరెస్ట్