Acid Attack on Woman : ఏపీలోని గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగులలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి... దాహంగా ఉంది.. తాగడానికి నీళ్లు ఇవ్వండి.. అంటూ ఓ ఇంటికి వెళ్లి అడిగాడు. నీళ్లు తెచ్చి ఇస్తున్న ఆమెపై యాసిడ్తో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఊహించని పరిణామంతో ఆ మహిళతో పాటు అక్కడున్నవారు షాకయ్యారు.
యాసిడ్ మీద పడటంతో బాధితురాలికి స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: ఆడపిల్ల పుడుతుందని మనోవేదనతో గృహిణి ఆత్మహత్య.. తీరా పోస్టుమార్టంలో చూస్తే!