ETV Bharat / crime

తల్లీకుమారుడి ఆత్మాహుతి కేసు.. నిందితులకు 14 రోజుల రిమాండ్​ - రామాయంపేటలో తల్లీకుమారుడి ఆత్మాహతి

Mother and Son Suicide Case: కామారెడ్డిలోని ఓ లాడ్జిలో తల్లీకుమారుడు ఆత్మాహుతి ఘటనలో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మెదక్‌ జిల్లా రామాయంపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ యాదగిరి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు.. ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

Mother and Son Suicide Case
తల్లీకుమారుడి ఆత్మాహతి కేసు
author img

By

Published : Apr 20, 2022, 12:52 PM IST

Updated : Apr 20, 2022, 7:05 PM IST

Mother and Son Suicide Case: కామారెడ్డిలో ఆత్మాహుతి చేసుకున్న తల్లీకుమారుడి కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు రిమాండ్​కు తరలించారు. కామారెడ్డి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మంగళవారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... కోర్టులో హాజరు పరిచే ముందు ఆస్పత్రిలో కొవిడ్ పరీక్షతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేయించారు. ఏ7 గా ఉన్న సీఐ నాగార్జున గౌడ్ మినహా ఆరుగురు నిందితులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో మెదక్​ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి, అతని కుమారుడు స్వరాజ్, సీఐ నాగార్జున గౌడ్ కీలకంగా ఉన్నారు.

నిప్పంటించుకుని ఆత్మహత్య: ఈ నెల 16న కామారెడ్డిలోని లాడ్జిలో నిప్పంటించుకుని రామాయంపేట​కు చెందిన తల్లీకుమారుడు పద్మ, సంతోష్​లు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో, ఆడియో, సూసైడ్ లేఖ రాశారు. వీటి ఆధారంగా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ బాధ్యతలు బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డికి అప్పగించారు. ఇప్పటికే మృతుల కుంటుంబీకుల నుంచి వివరాలు, ఆధారాలు సేకరించారు.

ఇవీ చదవండి: అమెరికాలో డాక్టర్‌నంటూ.. అందినకాడికి దోచేశాడు

అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం

Last Updated : Apr 20, 2022, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.