ETV Bharat / crime

అతివేగంగా వచ్చి.. కారును ఢీకొట్టి..! - Gatchibowli accident

రహదారులపై చిన్నపాటి నిర్లక్ష్యంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేగంగా గమ్యస్థానాలకు వెళ్లాలనే తొందరలో ఏమరపాటుతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటిదే హైదరాబాద్​ గౌలిదొడ్డిలో ఓ ప్రమాదం జరిగింది.

అతివేగంగా వచ్చి.. కారును ఢీకొట్టి..!
అతివేగంగా వచ్చి.. కారును ఢీకొట్టి..!
author img

By

Published : May 23, 2021, 2:13 PM IST

అతివేగంగా వచ్చి.. కారును ఢీకొట్టి..!

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్​లో అతి వేగంగా వచ్చిన మహీంద్రా కారు.. రోడ్డుకు అవతలి వైపు వెళ్తున్న ఫార్చునర్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ.. ఈ ప్రమాద సీసీ కెమెరా దృశ్యాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్​లో ఉంచారు. ఈ ఘటనపై ఈ నెల 21న మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చూడండి: ఒక్క ప్రమాదం.. రెండు కుటుంబాల్లో నింపిన తీవ్ర విషాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.