ETV Bharat / crime

ACB TRAP: లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ - acb officials trapped si while taking bribe

ఉన్నత కొలువుల్లో ఉంటూ కూడా కాసులకు కక్కుర్తి పడి లంచాలు తీసుకుంటున్నారు కొందరు అవినీతిపరులు. చేస్తున్న ఉద్యోగానికే మచ్చ తెచ్చి పెడుతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పీఎస్​లో రూ. లక్ష లంచం తీసుకుంటూ అనిశా(ACB)కు పట్టుబడ్డాడు ఓ ఎస్ఐ.

acb
ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ
author img

By

Published : Jul 14, 2021, 5:30 PM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రెండో పట్టణ ఎస్ఐ భాస్కర్ రావు.. లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు(అనిశా)చిక్కారు. స్టేషన్ బెయిల్​ ఇప్పించేందుకు బాధితుడి నుంచి రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

కరీంనగర్ జిల్లా బాహుపేట గ్రామానికి చెందిన అల్లే నవీన్.. తన తండ్రి సత్యనారాయణ, సోదరుడు వేణు 2019 సంవత్సరానికి సంబంధించిన ఓ కేసు విషయంలో రెండో పట్టణ ఎస్ఐ భాస్కరరావును కొద్దిరోజులుగా కలుస్తూ వస్తున్నారు. కేసులో స్టేషన్ బెయిల్ కావాలని అడగడంతో రూ. 2 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ​ డిమాండ్ చేశారు. రూ. 1.20 లక్షలు ఇవ్వడానికి బాధితుడు నవీన్ ఒప్పుకున్నాడు. తన డ్రైవర్​కు ఇవ్వాలని ఎస్​ఐ చెప్పాడు.

ఈ రోజు ఉదయం ప్రైవేట్ డ్రైవర్ రాజ్​కుమార్​కు డబ్బు ఇస్తుండగా అతనిని ఏసీబీ డీఎస్పీ కె. భద్రయ్య, సీఐలు రవీందర్, సంజీవ్​ రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఎస్ఐ భాస్కర్ రావు లంచం డిమాండ్ చేసినట్లుగా అనిశా అధికారులు నిర్ధరించారు. ఎస్​ఐతో పాటు డ్రైవర్ రాజ్ కుమార్​ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు.

స్టేషన్​ బెయిల్​ ఇవ్వడం కోసం పల్లె నవీన్​ వద్ద నుంచి.. బెల్లంపల్లి టూ టౌన్​ ఎస్​ఐ భాస్కరరావు రూ. 2 లక్షలు డిమాండ్​ చేశాడు. ఎన్ని సార్లు కలిసినా ఎస్​ఐ తగ్గకపోవడంతో రూ. లక్షా 20 వేలకు ఒప్పుకున్నాడు. తర్వాత నవీన్​ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. డబ్బులిచ్చేటప్పుడు తన డ్రైవర్​ చేతికి ఇవ్వాలని ఎస్​ఐ చెప్పడంతో అతనికి నవీన్​ డబ్బులిస్తుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నాం. త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తాం. -భద్రయ్య, అనిశా డీఎస్పీ

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఎస్​ఐ

ఇదీ చదవండి: ప్రగతిభవన్ వద్ద పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.