ETV Bharat / crime

అత్యాశకు పోయి అనిశాకు అడ్డంగా దొరికిన అధికారులు - acb raids in parigi mpdo office

అత్యాశకు పోయి అధికారులు అడ్డంగా దొరికిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఎనిమిది మందిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

acb raids, parigi mpdo
అనిశా సోదాలు, పరిగి ఎంపీడీఓ
author img

By

Published : Apr 1, 2021, 12:32 PM IST

వికారాబాద్ జిల్లా పరిగి మండల ప్రజాపరిషత్​ కార్యాలయానికి సంబంధించి 20 గ్రామాల్లో 770 సైన్ బోర్డులు బంటు చక్రవర్తి అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. వీటికి రూ.10 లక్షల బిల్లు అవ్వడం వల్ల ఎంబీ చేయమని ఎంపీడీఓ సుభాశ్ చంద్ర గౌడ్​ను అడిగాడు. ఈ పని చేయడానికి సుభాశ్ రూ.4 లక్షలు డిమాండ్ చేశాడు. అంత డబ్బు తను ఇచ్చుకోలేనని చక్రవర్తి చెప్పినా.. అడిగిన నగదు ఇస్తే తప్ప బిల్లు పాస్​ చేయనని తెగేసి చెప్పాడు.

ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చక్రవర్తి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందు రూ. 2లక్షలు ఇస్తానని.. మిగిలిన డబ్బు తర్వాత ఇస్తానని ఫోన్ ద్వారా ఎంపీడీఓకు చెప్పాడు. ఎంపీడీఓ సుభాశ్​.. రూ.2 లక్షలను ఈసీ రఫీకి ఇవ్వాలని చెప్పగా.. చక్రవర్తి పరిగి పట్టణంలోని ఎన్​ఆర్​ఈజీఎస్​ కార్యాలయంలో ఈసీకి డబ్బు అప్పజెప్పాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అనిశా అధికారులు రఫీని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రఫీతో పాటు ఏపీఓ నర్సింహులు, టెక్నిక్ అసిస్టెంట్లు, ఏసీబీ అధికారులు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.