ETV Bharat / crime

లైవ్​ వీడియో: సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

author img

By

Published : Mar 10, 2021, 8:58 PM IST

Updated : Mar 10, 2021, 9:04 PM IST

ఏసీలలో వాడే గ్యాస్​ పేలి ఒకరు చనిపోయిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. ఇద్దరు ఏసీ టెక్నీషియన్లు.. ద్విచక్ర వాహనంపై సిలిండర్​తో సహా వెళుతుండగా బోయిన్​పల్లి సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రద్దీగా ఉండే రహదారిపై జరిగిన ఈ ప్రమాదం వాహనదారులను ఉలిక్కిపడేలా చేసింది.

ac gas Cylinder Explosion Technician died at bowenpally
లైవ్​ వీడియో: సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి
లైవ్​ వీడియో: సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

కరీంనగర్‌కు చెందిన సలీం పాషా(21), రాంనగర్‌కు చెందిన మహ్మద్ సమీర్(20) ఓ ప్రైవేట్ ఏసీ కంపెనీలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్​ రాంనగర్‌లో నివాసముంటున్న వీరు.. బాలానగర్‌లో ఏసీ సర్వీసింగ్ చేయడానికి అందులో వాడే గ్యాస్ సిలిండర్‌తో సహా బైక్​పై వెళ్తున్నారు.

బోయినపల్లి చౌరస్తా నుండి బాలానగర్ వైపు వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో వెనకాల కూర్చున్న సలీం పాషా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, బైక్ నడిపిస్తున్న మహ్మద్ సమీర్ గాయాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రద్దీగా ఉండే రహదారిపై జరిగిన ఈ ఘటనతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు.

ఘటనాస్థలానికి చేరుకున్న బోయినపల్లి పోలీసులు మృతిచెందిన సలీం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి, మహ్మద్ సమీర్​ను​ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి : విద్యుత్ తీగలపై వ్యక్తి హల్‌చల్‌

Last Updated : Mar 10, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.