ETV Bharat / crime

ప్రేమించింది.. హిజ్రాగా మార్చింది... చివరికి ఏం చేసిందో తెలుసా? - కడపలో హిజ్రాగా మారిన యువతి

ఉద్యోగ శిక్షణ సమయంలో పరిచయమైంది. ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. నీకు అబ్బాయి లక్షణాలున్నాయి హిజ్రాగా మారితే పెళ్లి చేసుకుంటానని సదరు మహిళ.. ఆ యువతికి చెప్పింది. ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. పెళ్లి చేసుకోనంటూ మహిళ ముఖం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఏపీలోని కడపలో జరిగింది.

crime
crime
author img

By

Published : Jul 24, 2021, 11:59 AM IST

హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని ఓ మహిళ చెప్పడంతో ఓ యువతి హిజ్రాగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ మహిళ ముఖం చాటేయడంతో బాధితురాలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఏపీ కడపకు చెందిన ఓ యువతి తండ్రి చనిపోవడంతో ఆమెకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడే శిక్షణలో ఉన్న ఓ మహిళ పరిచయమైంది. ఇరువురికి వివాహం కాలేదు. మంచి స్నేహితులుగా మారారు.

యువతికి అబ్బాయి లక్షణాలున్నాయి. నీవు హిజ్రాగా మారితే వివాహం చేసుకుంటానని పరిచయమైన మహిళ.. ఆ యువతిని బలవంతపెట్టింది. ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. ఇరువురు కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోనని మహిళ ముఖం చాటేసింది. వారి ప్రేమను మహిళ తల్లిదండ్రులకు చెప్పిడంతో వారు అంగీకరించలేదు. మహిళను నిర్బంధించారు. హిజ్రాగా మారమని చెప్పి ఇప్పుడు మోసం చేసిందని, న్యాయం చేయాలని యువతి పోలీసులను ఆశ్రయించింది. మహిళపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసును ఎలా పరిష్కరించాలని పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.

ఇదీ చూడండి: ACCIDENT: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఘోరప్రమాదం.. 2 కార్లు ఢీ.. ఏడుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.