ETV Bharat / crime

Sexual Assault: ఒకడు అత్యాచారం చేశాడు.. మరొకడు రికార్డు చేసి బెదిరించాడు - బాలికపై అత్యాచారం

15 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా... మరో యువకుడు ఆ తతంగాన్ని రికార్డు చేశాడు. మరుసటి రోజు నుంచి రికార్డు చేసిన యువకుడు బాలికను బెదిరించాడు. తన వాంఛ తీర్చాలని... లేకుండా వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. తర్వాత ఏమైందంటే...

Sexual Assault
బాలికపై అత్యాచారం
author img

By

Published : Oct 7, 2021, 9:07 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా తల్లిదండ్రులతో నివాసముండే 15 ఏళ్ల బాలిక సెప్టెంబర్​ 30వ తేదీన రాత్రి చర్చికి వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మారుతీ నగర్​కు చెందిన దాసరి రాము(20) బాలికను బలవంతంగా సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి (raped a minor girl) పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బాలికను బెదిరించాడు.

ఈ తతంగాన్ని అదే గ్రామానికి చెందిన గురవయ్య (20) తన చరవాణిలో రికార్డు చేశాడు. మరుసటి రోజు నుంచి బాలికను లైంగిక వాంఛ తీర్చాలంటూ వెంటపడ్డాడు. లేకుంటే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. క్రమంగా వేధింపులు శృతిమించడంతో చేసేదేమి లేక ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు యువకులపై ఫిర్యాదు చేశారు. ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని... త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

అఘాయిత్యానికి పాల్పడుతున్న వానికి ఎలాగు బుద్ధిలేదు. కనీసం ఆ ఘటనను చూసిన వాడికైనా ఉండాలిగా. ఘోరాన్ని ఆపడం మానేసి.. సెల్​ఫోన్​లో రికార్డు చేసి మరీ.. ఆమెను బెదిరింపులకు గురిచేశాడంటే ఏం అనాలి. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం. అత్యాచారం చేయడమనేది రోజువారి పనిలో భాగమే అన్నట్లు.. ఏ మాత్రం భయంలేకుండా దారుణాలకు పాల్పడుతుంటే వారిని శిక్షించేవాళ్లు ఎక్కడున్నారు. ఆ కామాంధులకు భయం పుట్టించే చట్టాలు ఎప్పటికీ రావా..? వచ్చినా ఏమి చేయలేవా?.. అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి: hyderabad rape case: ఆగని అకృత్యాలు.. హైదరాబాద్‌లో మరో బాలికపై అత్యాచారం

Life imprisonment: మైనర్​ బాలికపై అత్యాచారం.. దోషికి జీవిత ఖైదు

తరగతిగదిలోనే విద్యార్థినిపై హెడ్​మాస్టర్​ లైంగిక వేధింపులు!

boy raped old women: వృద్ధురాలిపై అత్యాచారం.. మరో బాలికపైనా.!

boy raped oldage women: వృద్ధురాలిపై అత్యాచారం.. మరో ఆరేళ్ల బాలికపైనా యత్నం..

Father Raped: కన్నకూతురిపై తండ్రి అత్యాచారం... వీడియో తీయించి...

కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి.. బాలికపై బాబాయి అత్యాచారం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.