Youngman died in Metpally Accident : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్... ఓ యువకుడి ప్రాణాలు తీశాడు. నిజామాబాద్ నుంచి కోరుట్ల వెళ్తున్న లారీ మెట్‌పల్లి ఆర్టీసీ డిపో వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. లారీ నుంచి డ్రైవర్ కిందపడిపోయాడు. అదుపు తప్పిన లారీ వేగంగా ముందుకు వెళ్లి.... ద్విచక్రవాహనం మీద వెళ్తున్న సంకీర్తన్ అనే యువకుడిపైకి దూసుకుపోయింది.
ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను ఆరా తీశారు. సీసీ ఫుటేజీ సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: టోనీ వాట్సాప్ సందేశాలపైనే పోలీసుల నిఘా.. ఎందుకంటే..