సామాజిక మాధ్యమం ద్వారా మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిని ఆటకట్టించారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు. అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని బాలిక ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. మల్కాజిగిరిలోని లాలువాణినగర్‌కు చెందిన సయ్యద్ సైఫుద్దీన్ ఇన్‌స్టాగ్రాం ద్వారా యువతిని వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
తన సోదరికి స్నేహితురాలైన మైనర్ బాలికతో గతంలోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో యువతి తల్లి ఆ యువకుడిని హెచ్చరించింది. ఈ విషయంలో కక్ష పెంచుకున్న సైఫుద్దీన్ సామాజిక మాధ్యమం ద్వారా బాలికకు అసభ్యకర సందేశాలు పంపేవాడు. నగ్న చిత్రాలు పంపకుంటే బాలిక ఫోన్ నంబర్‌ను పోర్న్ సైట్స్‌లో పోస్టు చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు దర్యాప్తు చేసిన పోలీసులు పోకిరీని అరెస్టు చేశారు.